తెలుగుదేశం సభ్యత్వంతో కొత్త రికార్డును సృష్టించిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు : మాజీ మంత్రి ప్రత్తిపాటి.
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట:
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం వల్ల సమాజంలో ఒక మంచి గౌరవం లభిస్తుందని మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 26 న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తక్కువ సమయంలోనే కోటి మందికి పైగా సభ్యత్వాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వం పొందిన చిలకలూరిపేట మండల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్ ని, నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యం , యడ్లపాడు మండల అధ్యక్షులు కామినేని సాయి బాబా మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి వారికి అభినందనలు తెలిపి సభ్యత్వ కార్డులు అందజేశారు.