పేదల డాక్టర్ గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట:
డాక్టర్ కొల్లా రాజ మోహన్ రావు చే ప్రగతి నర్సింగ్ హోమ్ సేవలు ప్రారంభించి పేదల డాక్టర్ గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డాక్టర్ రాజమోహన్ రావు కి, అలాగే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి మించిన తనయుడు గా పేద ప్రజలను అక్కున చేర్చుకొని వారికి అవసరమైన వైధ్యాన్ని అన్నివేళలా అందిస్తున్నారని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు. ఆదివారం ఆయన డాక్టర్ కొల్లా అమర్ కి కూడా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇరువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య , ఈ కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్ , సాతులూరి కోటి , సయ్యద్ జమీర్ , వేజర్ల కోటేశ్వరరావు ,నార్నె హనుమంతరావు , షేక్ కరీముల్లా ,గ్రంధి ఆంజనేయులు , నరేంద్రరెడ్డి, ఈశ్వర్ రెడ్డి , శరత్ చంద్ , షేక్ హమద్ , అత్తోట శ్యామ్ , రావూరి దాసు,షేక్ జిలాని , షేక్ మహబుల్లా , దేవరకొండ గోపి , బిస్కెట్ బాబు, లింగాల విజయ్ యాదవ్ తదితరలు పాల్గొన్నారు.