గుంటూరు పూల హోల్‌సేల్ మార్కెట్‌లో భంతి పూల ధరలు బాగా పడిపోయాయి. గత వారం వరకు కిలో రూ.150కి అమ్ముడైన భంతి పూలు ప్రస్తుతం కిలో రూ.10కే కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా పూలు అమ్ముడుపోక రైతులు వాటిని గోతల్లో పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యడ్లపాడు మండలంలోని పుట్ట తోట గ్రామ పరిధిలోనే సుమారు 500 ఎకరాల్లో రైతులు భంతి సాగు చేశారు. అయితే అధిక ఉత్పత్తి, ఎగుమతులు తగ్గిపోవడం, మధ్యవర్తుల ప్రభావం, సీజనల్ డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు కుప్పకూలినట్లు రైతులు చెబుతున్నారు. మరోవైపు పెద్ద పండుగలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఈ కారణంగా రైతులకు తీవ్ర నష్టాలు తప్పవని పూల మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్న రైతు పద్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారం రోజులు గడిస్తే దసరా పండుగ సీజన్ కారణంగా పూల ధరలు మళ్లీ పెరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు పెద్ద పండుగలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఈ కారణంగా రైతులకు తీవ్ర నష్టాలు తప్పవని పూల మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్న రైతు పద్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారం రోజులు గడిస్తే దసరా పండుగ సీజన్ కారణంగా పూల ధరలు మళ్లీ పెరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.