విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేస్తున్న “సూపర్ సిక్స్ సూపర్ హిట్” వాస్తవానికి “అట్టర్ ఫ్లాప్” అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో హోటల్ ఐలాపురం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నా ఇబ్బందులు ఎక్కువయ్యాయని, దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఎక్కడ ఇచ్చారో ప్రభుత్వం వివరించాలని ప్రశ్నించారు.రైతులకు అన్నదాత సుఖీభవం ద్వారా న్యాయం జరగలేదని, మహిళలకు హామీ ఇచ్చిన ₹1500, యువతకు నిరుద్యోగ భృతి అమలు కాని స్థితిలో ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి— “సినిమాలు వదిలేసి రాజకీయాలు చేయి చంద్రబాబును నమ్మి మోసపోవద్దు” అని హెచ్చరించారు. సుగాలి ప్రీతి ఘటనపై న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు.
రైతుల పక్షాన నిలబడి మోడీ ప్రభుత్వంనుంచి నిధులు తెచ్చింది తానేనని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్‌గా ఆర్.కె.నాయుడిని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చిలు, చారిటీ భూములను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.