- నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సత్కారం
పలనాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అరుణ్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 16 నెలల కాలంలో నరసరావుపేట నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ అరుణ్ బాబు సహకారం అందించారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాడిపర్తి సురేష్, బండారు విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.