గుంటూరు, 13 సెప్టెంబర్ 2025:గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ అన్సారియా, IAS గారిని శనివారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APUWJ) గుంటూరు జిల్లా కమిటీ , నగర కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం జర్నలిస్టుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని యూనియన్ నాయకులు భరోసా ఇచ్చారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. “మీడియా సమాజానికి అద్దం లాంటిది. గుంటూరు జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రికా ప్రతినిధుల సహకారాన్ని ఆశిస్తున్నాను” అని అన్నారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శు లు ఎస్ ఎన్ మీరా, కే రాంబాబు, గుంటూరు నగర అధ్యక్ష కార్యదర్శులు కే వెంకయ్య, కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె రాజా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యుడు పర శ్యామ్, నగర ఉపాధ్యక్షులు ఏ. వీరభద్ర రావు బి. వెంకటేశ్వరరావు , కోశాధికారి సుభాని, సహాయ కార్యదర్శులు కే సుజి బాబు, జి అప్పారావు, కమిటీ సభ్యులు రఘునాథరెడ్డి, కోటి, పవన్ నాయుడు, మనీ, నాగ, సీనియర్ జర్నలిస్టులు దశరద రామిరెడ్డి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.