chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

గుంటూరు: 13- 09- 2025 జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి

గౌరవ జాతీయ మరియు రాష్ట్ర నీయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాలకు 13. 09. 2025 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని ఈ లోక్ అదాలత్ ద్వారా న్యాయ వివాదాలను పరిష్కరించడానికి ప్రజలకు సమయం , డబ్బు , ఒత్తిడిని తగ్గించడానికి , సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి ఇది గొప్ప అవకాశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ బి సాయి కల్యాణ చక్రవర్తి గారు తెలిపారు .ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 41 బెంచీలను ఏర్పాటు చేసారని జిల్లా కోర్ట్ ప్రాంగణంలో 16 బెంచీలను అలాగే 12 మండల కేంద్రాలలో 25 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . ఈ లోక్ అదాలత్ లో పౌర వివాదాలు , కుటుంబ వివాదాలు, భూ వివాదాలు , మోటారు వాహన ప్రమాద క్లెయిమ్స్ మరియు రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని మరియు వీటి పై ఎటువంటి అప్పీల్ ఉండదని కోర్ట్ డిక్రీ తో సమానమైన చట్ట బద్ధత ను కలిగి ఉంటుందని తెలిపారు . ఈ రోజు మోటారు వాహన ప్రమాద క్లైమే కేసు 2020 నెల్లూరు జిల్లా , కాటూరు గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన దివంగత యార్లగడ్డ శ్రీనివాసులు గారి క్లెయిమ్ కేసులో వారి కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కంపెనీ ద్వారా రూ . 85,00,000/- క్లెయిమ్ చేయగా ట్రయిల్ కోర్ట్ రూ . 82,49,202/- , మరియు 6 శాతం వడ్డీతో తీర్పు నివ్వగా ఇన్సూరెన్సు కంపెనీ వారు హై కోర్ట్ లో అప్పీల్ వేయగా ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వారు పరిహారాన్ని రూ . 91,74,094/- మరియు వడ్డీ 9 శాతం పెంచగా బాధితులు గుంటురులోని గౌరవ మొదటి అదనపు జిల్లా కోర్టులో ఎక్సిక్యూషన్ పిటిషన్ దాఖలు చేయగా లోక్ అదాలత్ చేసిన సయోధ్య ప్రయత్నాల ఫలితంగా ఈ కీలకమైన కేసు మొత్తం రూ . 1,11,82,343/- విజయవంతముగా పరిష్కారమైనది . ఈ చెక్కును బాధితుల తరపు న్యాయవాది శ్రీ వి . బ్రహ్మ రెడ్డి , ఇన్సూరెన్సు కంపెనీ తరపు న్యాయవాది శ్రీ . పి . రామాంజనేయులు మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కంపెనీ మేనేజర్ సమక్షంలో బాధితులకు జిల్లా జడ్జి శ్రీ సాయి కల్యాణ చక్రవర్తి గారు చేతుల మీదుగా అందజేశారు .
ఈ లోక్ అదాలత్ వేదికను ప్రజలు , న్యాయవాదులు సద్వినియోగం చేసుకొని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో అదనలోపు జిల్లా జడ్జి లు . సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ ) , ( జూనియర్ డివిజన్ ) జడ్జెస్ , న్యాయ వాదులు పాల్గొన్నారు . ఈ రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా సివిల్ కేసులు 908 మరియు క్రిమినల్ 10,480 కేసులు పరిష్కరించబడ్డాయి .

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker