వినుకొండ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ వారి సౌజన్యంతో శ్రీ చౌడేశ్వరి గొడుగుల మహోత్సవం సందర్భంగా శ్రీ దత్త సాయి కళాపరిషత్ ఆధ్వర్యంలో కడప జిల్లా,జమ్మలమడుగు లోని మైలవరం గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విశిష్ట అతిథిగా పాల్గొన్న, ఉత్తమ సేవాకళా రత్న అవార్డు గ్రహీత, జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మందా వెంకట్రావు ని కళాపరిషత్ అధ్యక్షులు ఎం .సి .ఆది రెడ్డి ఘనంగా సత్కరిస్తూ సేవా సామ్రాట్ బిరుదును ప్రధానం చేశారు .
ఈ సందర్భంగా ఆది రెడ్డి మాట్లాడుతూ మందా వెంకట్రావు జాషువా పద్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారని వారు రాష్ట్ర కళాకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు, మందా వెంకట్రావు మాట్లాడుతూ కడప జిల్లాలోని కళాకారులు మన భారత సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను చైతన్య పరుస్తు డటం చాలా అభినందనీయమని రాష్ట్రంలోని పేద కళాకారులను ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ఆదుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ,లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి కళా ప్రదర్శనల ద్వారా చేరవేసే విధంగా కళాకారులకు ఉపాధి అవకాశం కల్పించాలని గ్రామదర్శిని, జన్మభూమి తాలూకు పాత బిల్లులు త్వరగా విడుదల చేయాలని కోరుతూ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసి కళాకారుల స్థితిగతుల గూర్చి విజ్ఞప్తి చేసి తప్పకుండా సాధించే విధంగా కృషి చేస్తానని మందావెంకట్రావు తెలియజేశారు.
1,235 1 minute read