మహిళలకు ఉచిత బస్సు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్క ఆటో,క్యాబ్ డ్రైవర్లలందరికీ సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మాట మార్చి ఆటో యజమానులకు మాత్రమే వాహన మిత్ర పథకం అమలు చేయడం సరైంది కాదని ఆటో యజమానులతో పాటు లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కి వాహన మిత్ర అమలు చేయాలని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు, సెంట్రల్ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎం.హనుమంతరావు డిమాండ్ చేశారు రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు చార్జీలు ఆటో స్పేర్ పార్ట్స్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఆటో క్యాబ్,డ్రైవర్లకు సంవత్సరానికి 25,వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలని, సాధికారిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సి.ఎన్.జి గ్యాస్ సబ్సిడీతో అందించాలని, వేలాది రూపాయలు జరిమానాలు విధించే జీవో నెంబర్ 21,రద్దు చేయాలని సూచించారు. ఆటో,క్యాబ్ డ్రైవర్లకు ప్రకటించిన వాహన మిత్ర పథకం అమలులో పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని 300,యూనిట్లు కరెంటు వాడితే, ఐ.టి రిటన్స్, 1,000 చదరపు అడుగుల ఇల్లు ఉంటే వాహన మిత్ర కు అనహరులని ప్రకటించటం సరైనది కాదని వెంటనే ఆంక్షలు ఎత్తివేసి ప్రతి ఒక్క ఆటో క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల18,వ తేదీన ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
1,249 1 minute read