టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అసమర్థుడని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అసమర్థుడు అయినందునే ఆయన తరపున డొక్కా మాణిక్యవరప్రసాద్ వకాల్తా పుచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. డొక్కా మతి భ్రమించి మాట్లాడుతున్నాడని చెప్పారు. అసలు తాడికొండ నియోజకవర్గంతో డొక్కాకి ఏంటి పని అని డైమండ్ బాబు సూటిగా ప్రశ్నించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనే భావనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. దమ్ముంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాణిక్యవరప్రసాద్ మాట్లాడాలని హితవు పలికారు. హద్దు మీరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో టీడీపీకి స్పష్టమైన వైఖరి లేదని తెలిపారు. చంద్రబాబు మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. రాజధానిలో ఏళ్ల తరబడి నిర్మాణాలు చేస్తున్న కారణంగా భూముల ఇచ్చిన రైతులకు నష్టం జరుగుతోందని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. సీబీఎన్ రియల్ ఎస్టేట్ తప్పు అమరావతి రాజధానిలో ఎలాంటి పురోగతి లేదని ఆయన స్పష్టం చేశారు.
230 1 minute read