
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈమేరకు అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం. పేద దళిత వర్గాలు ఉన్నత వైద్య విద్య అభ్యసించడం చంద్రబాబుకు ఇష్టం లేదు.చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి రుజువు అయిందని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం.తక్షణమే సీఎం చంద్రబాబు ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.








