ఆంధ్రప్రదేశ్
పట్టణంలో మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు అకస్మిక తనిఖీలు.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట
చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు సోమవారం నాడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ముందుగా ఒకటో డివిజన్ కార్యాలయం వద్ద హాజరు పట్టికను పరిశీలించారు అనంతరం రెండవ డివిజన్ పరిధిలోని చంద్రమౌళి కూరగాయల మార్కెట్,చికెన్ షాపులు. చాపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో కలియతిరిగి పారిశుద్ధ్య పనుల నిర్వహణను పరిశీలించి ఇక్కడ స్థానికులతో మాట్లాడారు. అన్న క్యాంటీన్ ను సందర్శించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు.ఈ పర్యటనలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు