సాహితీవేత్త దీవి రామ బ్రహ్మం కు గౌరవ డాక్టరేట్.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట
పట్టణానికి చెందిన సాహితీవేత్త దీవి రామ బ్రహ్మం కు గౌరవ డాక్టరేట్ లభించింది. తెలుగు సంస్కృతి, సాహితీ సేవా ట్రస్ట్ వారు రామబ్రహ్మం చేసిన సాహితీ కృషికి ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. విజయవాడ లో జరిగిన ఓ సాహితీ కార్యక్రంలో ఆదివారం ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. రామ బ్రహ్మం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తూ పదవి విరమణ చేసారు. వీరు మోక్షదర్శనం, ఆయుర్వేద వైద్య దర్శిని, వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వదర్శిని వంటి ప్రామాణిక గ్రంధాలు రచించారు. అనేక సామాజిక, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సాహితీ సేవా రత్న వంటి ప్రతిష్టాత్మకమైన బిరుదులు అందుకున్నారు. రామ బ్రాహ్మంకు ఈ గౌరవ డాక్టరేట్ రావడం పట్ల పట్టణంలోని సాహితీవేత్తలు, కళాకారులు, డా..పీవీ సుబ్బారావు, దార్ల బుజ్జిబాబు, డా..విన్సెంట్ పాల్, ఏ.వి.శివయ్య, బుదాటి కోటయ్య, తదితరులు అభినందనలు తెలిపారు.