పొన్నూరులో లాయర్ ప్రకాష్ పై దాడి జరగడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈమేరకు మంగళవారం నాటి రిలే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. డిసిసి అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ జాన్ బాబు, సుధీర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అకారణంగా లాయర్ ప్రకాష్ పై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్యని ఈ సందర్భంగా విజయ్ కుమార్ చెప్పారు. న్యాయవాదులపై దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.
251 Less than a minute