chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం

అమరావతి : 17- 09 2025 వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేతృత్వంలో బీసీ మంత్రులు, హోం మంత్రి సవిత, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి సవిత విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి పాటు పడుతోందన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2025-26 బడ్జెట్ లో రూ.47 వేల కోట్లకుపైగా కేటాయించారన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూప కల్పనకు నిర్ణయించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం మేర బీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం బీసీ మంత్రులు రెండు పర్యాయాలు సమావేశమయ్యామని, త్వరలో మరో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బీసీలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీలోని బీసీ నాయకులను అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే లక్ష్యంగా బీసీ రక్షణ ట్టంసుకొస్తున్నామన్నారు.సుదీర్ఘంగా సాగిన సమావేశంఅంతకుముందు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మంత్రుల సమావేశం సుదీర్ఘంగా సాగింది. గత ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూపకల్పన, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై సమావేశంలో చర్చించారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా బీసీ రక్షణ చట్టం రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీసీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ సహా హోం మంత్రి అనిత, న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker