విజయవాడ: 17.09.2025 ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలుశ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా భక్తులు అందరూ ఆనందోత్సాహాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు రాష్ట్ర హోంశాఖా మాత్యులు శ్రీమతి వి.అనిత గారు ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకుని కొండపైన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అనంతరం మోడల్ గెస్డ్ హౌస్ నందు అన్నీ శాఖల అధికారులతో సీసీ కెమెరాలు,ట్రాఫిక్,క్యూ లైన్లు,Vip పాస్ లు మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ కేశినేని శివనాధ్ గారు (చిన్ని), జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశా ఐ.ఏ.ఎస్.గారు, పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు దుర్గగుడి ఈవో శ్రీ శీనానాయక్ గారు ఏ.డి.సి.పి. శ్రీ జి. రామ కృష్ణ గారు, ఏ.సి.పి.లు ఇన్స్పెక్టర్లు ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా రాష్ట్ర హోంశాఖా మాత్యులు శ్రీమతి వి.అనిత గారు మాట్లాడుతూ…. దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గతంలో ఒక్క ఇన్సిడెంట్ లేకుండా దసరా ఉత్సవాలని దిగ్విజయంగా జరిపించడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సారి 4,500 మందితో పోలీసులతో భధ్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. టెంపుల్ పరిసర ప్రాంతాలలో వెయ్యి కి పైగా సిసి కెమేరాలతో పాటు ఐదు డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నాం, ఈ సారి 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం .అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం, మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుస్తోంది. వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం, భవానీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం, విజయవాడ ఉత్సవ్ పై అమ్మవారి కరుణ ఉంది, అమ్మతో ఎవరూ పెట్టుకోకూడదు, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, ఏ సమాచారాన్నైనా అధికారులనుంచి అడిగి తెలుసుకోండిఎం.పి.శ్రీ కేశినేని శివనాధ్ గారు (చిన్ని) గారు మాట్లాడుతూ… ఈ సారి దసరా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం , అమ్మవారి దర్శనానికి గతేడాది కన్నా ఈ ఏడాది మరింత మంది వస్తారని అంచనా వేస్తున్నాం, అందుకు తగ్గ ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం, మేము దర్శనం విషయంలో స్వీయ నియంత్రణ పాటిస్తాం అని తెలియజేశారు.నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు మాట్లాడుతూ…… దసరా ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నాం, ఈ సారి అత్యదునిక సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకుని ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నీ శాఖల సమన్వయంతో భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తాం, విజయవాడ నగరం మొత్తం 12 వేల సిసి కెమేరాలతో పర్యవేక్షణ జరుగుతుంది, దర్శన సమయాలను ఇవ్వడం ద్వారా సులభంగా భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సారి కుమ్మరిపాలెం వైపు నుండి కూడా పటిష్టమైన క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ సదుపాయాలతో సుమారు 7000 మంది వేచి ఉండేలాగా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంవత్సరం ఒకే సమయంలో అసెంబ్లీ సమావేశాలు, విజయవాడ ఉత్సవ్, ఫ్రీ బస్సు నడుస్తున్న నేపధ్యంలో దసరా ఉత్సవాల్లో ఈ ఏడాది నాలుగు లక్షల మంది అత్యధికంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం, గత అనుభవాల దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం, ఈ సారి దసరా ఉత్సవాల్లో మహిళా పోలీసుల సేవలను ఉపయోగిస్తాం, ప్రతి ఒక్కరూ ఈ దసరా ఉత్సవాలకు సహకరించి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.
209 2 minutes read