Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్బాపట్ల

సూర్యలంక బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలిఅధికారులను ఆదేశించిన మంత్రుల బృంధం

బాపట్ల-17.9.2025 :బాపట్లలోని ఆహ్లాదకరమైన సూర్యలంక బీచ్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృంధం అధికారులను ఆదేశించింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి, శ్రీ కొల్లు రవీంద్ర, శ్రీ అనగాని సత్యం ప్రసాద్ మరియు శ్రీ గొట్టిపాటి రవికుమార్ తో కూడిన మంత్రుల బృందం సూర్యలంక బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లపై సంబందిత శాఖల అధికారులతో సమావేశమై సమంగ్రంగా చర్చించి పలు ఆదేశాలను జారీచేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల అనుసంధానంగా నిర్వహించబడుతున్న నేపద్యంలో ఈ వేడుకలను ఎంతో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా సూర్యలంక బీచ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు వచ్చేలా పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. పర్యాటకులు మరియు సందర్శకులకు ఆహ్లదం కలిగించే విధంగా క్రీడలు, క్రీడా సదుపాయాలు మరియు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో మరియు సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహణకు తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాంప్రదాయ మరియు ఆధునిక సాంస్కృతిక కార్యక్రమాలు, బీచ్ క్రీడలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు, స్థానిక వంటకాలతో ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని, అందుకు తగ్గట్టుగా పటిష్టంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు ఈ బీచ్ ఫెస్టివల్ కు హాజరయ్యే అవకాశం ఉన్నందున శాంతి భద్రతల విషయం పై ప్రత్యేక శ్రద్దచూపాల్సి ఉందన్నారు.ఈ నెల 27న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూర్యలంక బీచ్‌ను సందర్శించనున్నారని, ఈ సందర్భంగా రూ.97 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, అందుకు తగ్గట్టుగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది.రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గృహా నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ఈ బీచ్ ఫెస్టివల్ కు విస్తృత ప్రచారన్న కల్పించే విధంగా బాపట్ల జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాదులో కూడా అవుడోర్ పబ్లిసిటీకై విస్తృత ఏర్పాట్లు చేయాలని, సోషల్ మీడియా ను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.బాపట్ల జిల్లా కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ మూడు రోజుల ఈ బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మంత్రుల బృందానికి వివరించారు. అన్ని వయస్సుల వారికి అనుకూలంగా వినోదం, సాంస్కృతిక సంపదను అందించేలా ఈ ఉత్సవం రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఫెస్టివల్ జరిగే ప్రాంతాలను, రహదారులను, వేదికలను సుందరంగా తీర్చిదిద్దే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి పనులతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సూర్యలంక జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు సంబందిత అన్ని శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button