గుంటూరు, 18 – 09 – 2025 గుంటూరు లోని పలు వక్ఫ్ ఆస్తులను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. గుంటూరు లోని వాసవి నగర్ మరియు రెడ్డిపాలెం ల లోని నిర్కీ సర్వీసెస్, షాహీ జామియా మసీదు లకు సంబంధించిన 260 ఎకరాల భూములను పరిశీలించారు. అనంతరం గుంటూరు లాలా పేట లోని షాహీ జామియా మసీదు కు విచ్చేసి ముత్తవల్లీలు, పేష్ ఇమామ్ లతో సమావేశమయ్యారు. భూములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీటి అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందిస్తామని, ఆదాయాన్ని పెంచి నిరుపేద ముస్లిం ల అభివృద్ధి కి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీయా ను మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా లోని పలు వక్ఫ్ సమస్యల పై ఇరువురు చర్చించారు. వారితో పాటు వక్ఫ్ బోర్డ్ సీఈవో మొహమ్మద్ అలీ, డీఆర్వో ఖాజావలి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఉన్నారు.
204 Less than a minute