హైదరాబాద్: ఇబ్రహీం బాగ్‌లోని 17 ఎకరాల గైరాన్ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC)కి గత ప్రభుత్వం కేటాయించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు రాజు వస్తాద్, రాకేష్ పటేల్, వి.ఎస్. రాజు, విశాల్ పటేల్ ఈరోజు మంత్రి వివేక వెంకట స్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు. తమ గ్రామ హక్కులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మంత్రి గ్రామస్తుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి తగిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
207 Less than a minute