“బాపట్ల:20 -09-2025:-నేను ఈరోజు బాపట్ల మెడికల్ కాలేజీ అంశంపై మాట్లాడుతూ, జగన్ హయాంలో జరిగిన కొన్ని తప్పిదాలను ఉదాహరణగా చెప్పే క్రమంలో పొరపాటున నాయి బ్రాహ్మణులపై అనవసరంగా అపార్థం కలిగించే విధంగా మాట బయటకు వచ్చింది. ఆ మాటను నేను ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. వైసీపీ సోషల్ మీడియా వారు దాన్ని వేరే అర్థంలో హల్చల్ చేస్తున్నారు. నిజానికి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకల వంటి వారు. బీసీ సోదరులు, నాయి బ్రాహ్మణులు తమ ఆశీర్వాదం, ఓట్లతోనే ఇటు బాపట్ల నియోజకవర్గంలోనూ, రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించారు. నేను చెప్పిన ఆ మాట ఎవరి మనసుకైనా నచ్చకపోతే, నాయి బ్రాహ్మణుల సోదరులకు, బీసీ సోదరులకు హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను. అదేవిధంగా బీసీల హక్కుల పరిరక్షణ కోసం బీసీ ఆక్ట్ తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని మరోసారి భరోసా ఇస్తున్నాను.
1,010 Less than a minute