బాపట్ల, సెప్టెంబర్ 20:స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం శుక్రవారం రోజు ఉదయంఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ సంయుక్త కలెక్టర్ శ్రీ జి. గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గారు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి గారుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం, వారు స్వయంగా చెత్తను తొలగించి, ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందించేందుకు ఆదర్శంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు బొంతు శివసామిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛత కార్యక్రమానికి మద్దతు తెలిపారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేసే ఈ రకమైన కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.