గుంటూరు:20 09 25: కలెక్టరేట్ వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం శనివారం జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ…. “స్వచ్ఛత హీ సేవా హీ” కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. “మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, దైనందిన పరిశుభ్రత మన అందరి భాగస్వామ్యంతోనే సాధ్యం అవుతుంది. అధికారుల నిబద్ధత, ప్రజల అవగాహన, మా కృషి కలిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. దీనికి కావలసిన నిధులు, సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చాలని కోరుతున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మీడియా మిత్రులు, ప్రజలు అందరూ కలిసివస్తే మాత్రమే శాశ్వత మార్పు సాధ్యమవుతుంది” అని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు
1,002 1 minute read