హైదరాబాద్:మెహదీపట్నం :-సెంటెన్స్ కళాశాలలో ఈరోజు 42వ వార్షికోత్సవం మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది పూర్వ విద్యార్థులు హాజరై, కళాశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను పునర్మధించారు.
పాల్గొన్న విద్యార్థులు తమ స్నేహితులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. “ఈరోజు మేము ఏ స్థాయిలో ఉన్నామో అది మా గురువుల బోధన, ప్రోత్సాహమే కారణం,” అని వారు తెలిపారు. కళాశాల రోజులను స్మరించుకుంటూ పలువురు కంటతడి పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరిచంద్ర హాజరు కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. “హరిచందన్ కూడా మా కళాశాల విద్యార్థే,” అని వారు తెలిపారు.