chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., దంపతులు

విజయవాడ, సెప్టెంబర్ 21: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా ఘనంగా కొనసాగింది.

నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., సతీమణి సమేతంగా సెప్టెంబర్ 22న సాయంత్రం సమయంలో అమ్మవారికి చీరా, సారెను సమర్పించారు.

ఈ సందర్భంగా ముందుగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న రావిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేపట్టారు. అనంతరం దేవస్థానానికి చేరుకున్న పోలీస్ కమీషనర్ దంపతులను ఈవో శ్రీ శీనానాయక్, ఆలయ వేదపండితులు మరియు వైదిక కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించారు.

వేద మంత్రోచ్చారణల నడుమ పోలీస్ కమీషనర్ గారు సతీ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ వేడుకలో డీసీపీలు కె.జి.వి. సరిత, తిరుమలేశ్వర రెడ్డి, ఉదయరాణి, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదే కార్యక్రమం శరన్నవరాత్రుల ప్రారంభానికి నాంది పలుకుతూ, నగర పోలీస్ విభాగం తరఫున అమ్మవారికి సమర్పించిన వినమ్ర నివాళిగా అభివర్ణించబడింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker