హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించిన ‘ఓజీ కన్సర్ట్’ అభిమానుల అద్భుత స్పందనతో ఘనవిజయాన్ని సాధించింది. భారీ వర్షం కురుస్తున్నా, అభిమానులు చూపించిన అపారమైన ప్రేమ, ఉత్సాహం మరువలేనిది.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ:
“మీ మద్దతు, అభిమానం నా బలమే. ‘ఓజీ’ సినిమాపై మీరు చూపుతున్న విశ్వాసం నా బాధ్యతను మరింత పెంచుతోంది. మీ నమ్మకం నాకు శక్తినిస్తోంది,” అని అన్నారు.
చిత్రానికి సహకారం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ఇరువురు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహాన్ని ఆయన అభినందించారు.
కన్సర్ట్ విజయవంతం కావడానికి సహకరించిన తెలంగాణ మంత్రివర్గ సభ్యులు, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, స్టేడియం నిర్వాహకులు, అధికారులు, పోలీసు బృందంకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమ నిర్వహణలో భాగమైన శ్రేయాస్ మీడియా, ప్రచారం అందిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, విలేకరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
‘ఓజీ’ చిత్రాన్ని అద్భుతంగా రూపకల్పన చేసిన దర్శకుడు సుజిత్, నిర్మాతలు డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.