KRISHNAJILLA.:రూ.24 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పుష్ కార్డ్స్..
రూ.24 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పుష్ కార్డ్స్
గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూ.24 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పుష్ కార్డ్స్ ను. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి..ఎమ్మెల్యే వెనిగండ్ల.రాము ప్రారంభించారు. పుష్ కార్డ్స్ పనితీరు ఇంటింటి చెత్త సేకరణకు నూతనంగా ప్రవేశపెట్టిన మైక్రో పాకెట్ సిస్టంను కమిషనర్ ఎమ్మెల్యే కు వివరించారు.కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పుష్ కార్డ్ లో 6వందల లీటర్ల సామర్థ్యం గల నాలుగు డస్ట్ బిన్లు ఏర్పాటు చేశామని,నేటి నుంచి 36 వార్డుల పరిధిలో చెత్త సేకరిస్తారని,ప్రతి 350 ఇళ్లకు మైక్రో ప్యాకెట్ రూట్ మ్యాప్ ద్వారా చెత్త సేకరణ 100% జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… గుడివాడ అభివృద్ధి,స్వచ్ఛతకు ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఫలితాలు సాధించలేమని కొత్త గుడివాడ రూపకల్పనకు అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రజలు సహకరించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.