కట్టుబట్టలతో మిగిలిన అగ్ని ప్రమాద బాధితులు..
ఈపూరు : మండలంలోని వనికుంట
గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో రెండు పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బచ్చనబోయిన ఆంజనేయులు నివాస గృహంలో ఇంటిలో ఉన్న నీళ్ళ మోటారు స్వీచ్ అన్ చేయగా విద్యు దాఘాతమై మంటలు చెలరేగి ఇంటికి అంటుకున్నాయి. పక్కనే ఉన్న షేక్ నన్నేసా ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈప్రమాదంలో బచ్చనబోయిన ఆంజనేయులు నివాస గృహాంలో రూ.2 లక్షలు నగదుతో పాటు 56 గ్రాములు బంగారం కాలిపోయింది. షేక్ నన్నేసా నివాస గృహం సైతం పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతైంది. ఆరు పాడిగేదలు ఉండగా ఒక గేద ప్రమాదం లో మృతి చెందింది. మిగిలిన గేదలు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో పెను ప్రమాదం తప్పడంతో పాటు మంటలను ఆదుపులోకి తెచ్చారు. ఎస్సై యం. ఉమామహే శ్వరరావు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరు అడిగిన తెలుసు కున్నారు. అగ్ని ప్రమాదంలో ఆంజనేయులు రూ.13 లక్షలు, షేక్ నన్నేసా రూ.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు.