ఎన్డీఏ కూటమి పరిపాలన ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టబద్దల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టిడిపి నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆలపాటి రాజా, అశోక్ బాబు తెలిపారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
243 Less than a minute