గుంటూరు, సెప్టెంబర్ 23:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 25న వెలగపూడి సచివాలయం సమీపంలో నిర్వహించనున్న డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను మంగళవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ తదితర అధికారులు సమీక్షించారు.
ప్రధాన వేదిక, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలన జరిపిన అధికారులు, ఎల్.ఇ.డి స్క్రీన్లు, బారికేడ్ల ఏర్పాటుపై సూచనలు ఇచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
జిల్లాల నుంచి విచ్చేయనున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండుండా సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని అధికారులపై గట్టి దృష్టి పెట్టారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీలు రమణమూర్తి (అడ్మిన్), మల్లికార్జునరావు (SSG), హనుమంతు (AR), రవికుమార్ (L&O ATV), ఆర్డిఒ శ్రీనివాసరావు, తుళ్లూరు ఎస్‌డిపిఒ మురళీకృష్ణ, సీఆర్డీఏ ఇంటెలిజెన్స్ డీఎస్పీ సుధాకర్‌బాబు, ఎస్‌బి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌బి సీఐ శ్రీహరి, రోడ్డులు భద్రత విభాగం అధికారి లక్ష్మణారాయణ, మెడికల్ ఆఫీసర్ తుళ్లూరు శ్రీనివాసరావు, ఈఈ సీఆర్డీఏ శ్రీనివాసరావు, ఏపీ సిపిడిసి ఎల్ ఈఈ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.