చాలా మందికి అరికాళ్లు, అదే పాదాలలో మంటను అనుభవిస్తుంటారు. కానీ, దానిని పెద్దగా పట్టించుకోరు. ఈ మంటను సాధారణ అలసట లేదా ఎక్కువసేపు నడవడం వల్ల అనుకుంటూ ఉంటారు. కానీ, నిరంతర పాదాలలో మంట తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పాదాల మంట నరాలు, రక్త ప్రసరణ, శరీర పోషక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
పాదాలలో మంటకు కారణాలు:
- నరాల దెబ్బతినడం (Peripheral Neuropathy):
మధుమేహం వంటి రోగాలలో అధిక రక్తంలో చక్కెర స్థాయిలు పాదాలలోని నరాలను క్రమంగా దెబ్బతీస్తాయి. దీని ఫలితంగా పాదాలలో జలదరింపు, తిమ్మిరి, మంటలు వస్తాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే శాశ్వత నరాల నష్టం సంభవించవచ్చు. - విటమిన్ లోపం:
విటమిన్ బి12 లోపం వల్ల నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. పాదాలలో నొప్పి, జలదరింపు, మంట అనుభూతులను కలిగిస్తుంది. విటమిన్లు డి, బి5, ఇ కూడా నరాల, కండరాల ఆరోగ్యానికి అవసరం. - ఫంగల్ ఇన్ఫెక్షన్లు:
తడి సాక్స్ లేదా తడి బూట్లు వేసుకోవడం వల్ల పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. ఇది పాదాలలో మంట, కడుపు, దుర్వాసన వంటి లక్షణాలను కలిగిస్తుంది. - రక్త ప్రసరణ సమస్యలు:
రక్త ప్రసరణ సమస్యలు కూడా పాదాలలో మంటకు కారణమవుతాయి. ఇది పాదాలలో చల్లదనం, నొప్పి, మంట వంటి లక్షణాలను కలిగిస్తుంది. - మధుమేహం (Diabetes):
మధుమేహం ఉన్న వ్యక్తులు ఎక్కువగా పాదాలలో మంటను అనుభవిస్తారు. ఇది నరాల దెబ్బతినడం వల్ల జరుగుతుంది.
పాదాల మంటను తగ్గించడానికి సూచనలు:
- సమతుల్య ఆహారం:
గుడ్లు, పాలు, ఆకుకూరలు, గింజలు, బలవర్థకమైన తృణధాన్యాలు వంటి సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాలను నివారించవచ్చు. - తడి బూట్లు, సాక్స్ వాడకాన్ని నివారించండి:
తడి బూట్లు లేదా సాక్స్ వేసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. అందువల్ల, శుభ్రంగా, పొడిగా ఉండే బూట్లు, సాక్స్ వాడండి. - పాదాలను శుభ్రంగా ఉంచండి:
పాదాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచడం, పొడిగా ఉంచడం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. - విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోండి:
విటమిన్ బి12, డి, బి5, ఇ వంటి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. - ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి:
పాదాలలో మంట ఉంటే, మధుమేహం, విటమిన్ లోపం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను గుర్తించడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
ముఖ్య సూచన:
పాదాలలో మంట ఉంటే, దాన్ని లైట్ తీసుకోకండి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సమయానికి వైద్య సలహా తీసుకోవడం ద్వారా సమస్యను నివారించవచ్చు.