అభిమానుల్లో జోష్ పెంచుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక జీవో జారీ చేసింది.
ఈసారి మరింత స్పెషల్‌గా — గతంలో ఎన్నడూ లేని విధంగా — సినిమాకు ప్రేమియర్ షోలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది.
సాధారణంగా సినిమాలు విడుదల రోజు తెల్లవారుజామున మొదలయ్యేవి, కానీ OG కి స్పెషల్ ప్రాముఖ్యతతో సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటల నుంచే ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.
అంతేకాదు, ముందుగా అనుకున్న షో టైమింగ్స్ — సెప్టెంబర్ 25 తెల్లవారుజామున 1 గంట నుండి షోలు ప్రారంభం అవుతాయని భావించారు. కానీ తాజాగా విడుదలైన జీవో ప్రకారం, ఆ సమయం సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు ముందుకి మార్చారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రీమియర్ షో టికెట్ ధరను ఏకంగా రూ.1000గా నిర్ణయించింది ప్రభుత్వం.
సినిమాపై భారీ అంచనాలు, అభిమానుల క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే OG పై భారీ హైప్ నెలకొనగా, ఈ జీవోతో థియేటర్ల వద్ద సంబరం మరింత పెరిగే అవకాశం ఉంది.