ఆంధ్రప్రదేశ్
జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజర్వ్‌పై హర్షం ..యువ నాయకులు మండలనేని చరణ్‌తేజ.
పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన ను గుర్తిస్తూ జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయడం శుభసూచికమని, పార్టీ ప్రస్థానంలో కీలక పరిణామని జనసేన యువనాయకులు మండలనేని చరణ్‌తేజ చెప్పారు. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజర్వ్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు జనసేన ఓ రాజకీయపార్టీ.. ఎన్నికల తర్వాత ఆపార్టీ ఓ శక్తిగా మారిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ తరగని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ, నిరుపేదల ఆశా కిరణం లా జనసేన నిలించిందన్నారు.