తిమ్మరాజుపాలెం, సెప్టెంబర్ 24:దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తిమ్మరాజుపాలెం గ్రామ ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త. గ్రామంలో ఫిల్టర్ బెడ్స్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఈరోజు గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ప్రజల సమక్షంలో నిర్వహించబడింది.
గత ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆ హామీని నెరవేర్చుతూ, రూ. 70 లక్షల 40 వేల జల జీవన్ మిషన్ నిధులను ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం మరియు గ్రామం మొత్తం కొత్త పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కోసం కేటాయించారు.
ప్రస్తుతం ఆ నిధులతో పనులు ప్రారంభం కానుండగా, తొలి దశగా భూమిపూజ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు MLA శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చర్యతో గ్రామంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.