ఎన్.టి.ఆర్.జిల్లా: 24 09 25: శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ధర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయడమే లక్ష్యంగా చేసుకుని నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి దర్శనం కోసం ఎంతో వ్యయప్రయాసలు పడుతూ వచ్చే దివ్యాంగులు, వృద్దులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే సడుద్దేశంతో పోలీస్ సేవాధల్ ను ఏర్పాటు చేసి వృద్ధులు, దివ్యాంగులు అమ్మవారి దర్శనం చేసుకోవడంలో సహాయం చేయడం జరుగుతుంది.ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి గారి పర్యటన నేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు డ్రోన్ కెమెరాల ద్వారా కామాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తగు ఆదేశాలను జరిచేయడం జరుగుతుంది. సి.పి.గారి ఆదేశాల ప్రకారం డి.సి.పి. శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు టెంపుల్ పైన ఏరియాలను స్వయంగా పరిశీలించి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ బంధోబస్త్ సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది.అనంతరం నగర పోలీస్ కమీషనర్ గారు పున్నమిఘాట్ నందు జరుగు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి గారి వస్తున్న నేపథ్యంలో సదరు పున్నమిఘాట్ ఏరియాలను పరిశీలించి ఎక్కడా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ బందోబస్త్ విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
1,013 1 minute read