chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

parchuru Local news:పర్చూరు నియోజకవర్గానికి రూ.2.57 కోట్లు మంజూరుఎమ్మెల్యే ఏలూరి కృషి ఫలితం… గ్రామీణ అభివృద్ధికి బలం

పర్చూరు, సెప్టెంబరు 25:పర్చూరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో మొత్తం రూ.2.57 కోట్ల నిధులను మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రెయినేజీ వ్యవస్థల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించబడ్డాయి.

ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద ఈ పనులకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో డీపీసీ & కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, ప్రజల నిత్య జీవన విధానాన్ని సులభతరం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.Parchur:కంచర్ల రామయ్య మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం

తాజాగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ వినోద్ కుమార్‌ను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కలిసి పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన కలెక్టర్ తక్షణమే రూ.2.57 కోట్లకు ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు.

parchuru Local news:పర్చూరు నియోజకవర్గానికి రూ.2.57 కోట్లు మంజూరుఎమ్మెల్యే ఏలూరి కృషి ఫలితం... గ్రామీణ అభివృద్ధికి బలం

పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

  • పోపూరి శ్రీనివాసరావు హౌస్ నుండి నాగరాజుపల్లి రోడ్డు మార్గం (మార్టూరు): సీసీ రోడ్డు & డ్రెయిన్ – రూ.21 లక్షలు
  • న్యూ ఎస్‌టి కాలనీ (అడుసుమల్లి): సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణం – రూ.50 లక్షలు
  • ప్రధాన రహదారి (అడుసుమల్లి): సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు – రూ.50 లక్షలు
  • మార్టూరు టీచర్స్ కాలనీ: పెట్రోల్ బంక్ నుండి స్వాతి హౌస్ వరకు సీసీ రోడ్డుతో డ్రెయిన్ – రూ.12 లక్షలు
  • చిమ్మిరిబండ (ఎస్‌సి కాలనీ): సీసీ రోడ్డు – రూ.15 లక్షలు
  • మార్టూరు గ్రామం: సీసీ రోడ్డు – రూ.10 లక్షలు
  • ఇంకోలు మండలం:
    • గొల్లపాలెం సీసీ రోడ్డు – రూ.6 లక్షలు
    • నక్కలపాలెం గ్రామం సీసీ రోడ్డు – రూ.6 లక్షలు
    • చిన్నగంజాం మండలం:
      • కడవకుదురు (ఎస్‌సి కాలనీ) సీసీ రోడ్డు – రూ.10 లక్షలు
      • పెద్దగంజం (పాత గొల్లపాలెం) సీసీ రోడ్డు & డ్రెయిన్లు – రూ.20 లక్షలు
    • హనుమోజిపాలెం గ్రామం సీసీ రోడ్డు – రూ.7 లక్షలు

ఈ నిధుల విడుదలతో పలు గ్రామాల్లో రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, జీవన ప్రమాణాల్లో మార్పు ఈ అభివృద్ధి పనుల ఫలితంగా కనిపించనుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker