జాతీయ వార్తలు

NATIONAL SCHOOL GAMES.:బాలబాలికల టోర్న్ మెంట్ 2024-2025..

NATIONAL SCHOOL GAMES

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ కార్యదర్శి భానుమూర్తి రాజు..

68 వ నేషనల్ స్కూల్ గేమ్స్ సేపక్ తాక్రా U-14 బాలబాలికల టోర్న్ మెంట్ 2024-2025
ను ఈ నెల 24 నుండి 27 వరకు కేబీసీ జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ పటమటలో జరుగుతాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ కార్యదర్శి భానుమూర్తి రాజు గురువారం తెలిపారు.. ఈ సందర్భంగా పటమట స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ కార్యదర్శి భానుమూర్తి రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఫ్లడ్ లైట్స్ వెలుగులో టోర్నమెంట్ నిర్వహణ, రెండు ఫ్లడ్ లైట్ కోర్టులతో సహా మొత్తం నాలుగు కోర్టులు సిద్ధం ఇందుకోసం సన్నద్ధం చేశారన్నారు. ఇందుకోసం విజయవాడ నగరం ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధం గా ఉందన్నారు.

• నేషనల్ స్కూల్ గేమ్స్ సేపక్ తాక్రా U-14 బాలబాలికల టోర్న్ మెంట్ 2024-2025
• 24 నుండి 27 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పటమట (బాలురు) వేదిక
• పటమట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 24 నుండి 27 వరకు నిర్వహణ
• టోర్నమెంట్ లో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న 12 రాష్ట్రాల జట్లు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఉమ్మడి కృష్ణాజిల్లా శాఖ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నాయన్నారు.

12 రాష్ట్రాలు పాల్గొనే ఈ టోర్నమెంట్ కోసం నాలుగు కోర్టులు సిద్ధం గా ఉన్నాయన్నారు. దీనిలో ఫ్లడ్ లైట్లతో కూడిన రెండు కోర్టుల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్ లు నిర్వహిస్తున్నారన్నారు. మైదానంలో 12 రాష్ట్రాలకు చెందిన టీమ్స్ ప్రాక్టీస్ ను ప్రారంభించాయన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామ రాజు, సమగ్రశిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టోర్నీ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button