Guntur News: ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
LOKESH BIRTHDAY IN GUNTUR
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మాధవి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రములో లోకేష్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు APIDC చైర్మన్ డేగల ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ నిధిని స్థాపించి, ఎంతోమంది కార్యకర్తల కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకొని, యువగళం పేరుతో వేలాది కిలో మీటర్లు నడిచి, లక్షలాది మంది ప్రజల సమస్యలను విని, మంత్రి హోదాలో నేడు సమస్యల పరిష్కారానికి నారా లోకేష్ ఎంతో కృషి చేశారని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావాలని, దావోస్ లో అనేక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తూ, అనుక్షణం శ్రమిస్తున్నారని కొనియాడారు.అదేవిధంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగువారి అభివృద్ధికి పురోభివృద్ధికి బాటలు వేసే చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్నటువంటి లోకేష్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఐటీ రంగమే కాకుండా విద్యా రంగంలోనూ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలూ కృషి చేస్తూ భావితరాలకు ఆశాజ్యోతిగా అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి లోకేష్ బాబు మరిన్ని పదవులు అలంకరించాలని ప్రభాకర్ పేర్కొన్నారు.