
ఈనెల 19వ తేదీన జరిగిన పలకలూరుకు చెందిన చెన్నంశెట్టి గోవిందరాజు హత్య కేసును పోలీసులు చేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో గోవిందరాజును హత్య చేసినట్లు ప్రకటించారు. 19వ తేదీన రాత్రి గోవిందరాజుని మద్యం సేవించేందుకు తీసుకెళ్లి హత్య చేయడం జరిగిందని చెప్పారు. అరెస్టు కాబడిన ఏ1 పి. వెంకటేశ్వర్లుకు మృతుడి భార్య లక్ష్మికి అక్రమ సంబంధం ఉందని తెలిపారు. అయితే గోవిందరాజును అడ్డు తొలగించి ఆస్తి కొట్టేయాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు వెల్లడించారు. షేక్ ఖాసిం అనే నిందితుడికి కూడా హత్య చేయడంలో పాత్ర ఉన్నట్లు చెప్పారు.







