
ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్న ముఖ్యమంత్రి. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లా దత్తి గ్రామానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటికి 64.35 శాతం మేర పింఛన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. ఈ నెల పింఛన్ల పంపిణీకి రూ.2,745 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.







