chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

GANDHI JAYANTI IN GUNTUR

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈమేరకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే స్ఫూర్తి. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని, శాంతియుత పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని ఆయన నిరూపించారు. గాంధీజీ ఆశయాలు చిరస్మరణీయాలు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛత సమాజం కోసం మనమంతా కృషి చేయాలి. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి సాదాసీదా జీవనశైలి, దేశభక్తి అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో ఆయన దేశానికి నూతన దిశ చూపించారని, దేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుల త్యాగాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker