ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ప్రారంభోత్సవం గుంటూరులో జరిగింది. రెవెన్యూ కళ్యాణ మంటపంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ అతిథిలుగా హాజరై ప్రారంభించారు. జిల్లాలోని 13,193 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రులు మాట్లాడారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావం ఆటో డ్రైవర్లపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో 10 వేలు సాయం అందించి 20 వేలు గ్రీన్ టాక్స్ వసూలు చేశారు. నేడు అదే టాక్స్ మూడు వేలకు తగ్గించడం జరిగింది. 80 శాతం గంజాయి వాడకం తగ్గించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. గత ప్రభుత్వంలో సంక్షేమం మాత్రమే జరిగితే నేడు అభివృద్ధి, సంక్షేమం సమాన రీతిలో జరుగుతుందని. ఆటో డ్రైవర్ లు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహ్మద్ నసీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్ తమీమ్ అన్సారియా తదితరులు పాల్గొన్నారు.
1,005 Less than a minute