బాపట్ల జిల్లాలో బి.సి. సంక్షేమ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా బి.సి. సంక్షేమాధికారిణి అనుమతి లేకుండా తరచూ జిల్లా పరిధి దాటి వెళ్తున్నారని, కార్యాలయంలో అందుబాటులో లేరని సంబంధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు అనుకున్న విధంగా జరగకపోవడం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ప్రభుత్వం నిర్వహించే సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పలుమార్లు గైర్హాజరు కావడం వల్ల శాఖ ప్రాధాన్యం తగ్గిపోతున్నది. అధికారిక అనుమతి లేకుండా సహాయక అధికారులను తాత్కాలికంగా నియమించడం, వారికి బాధ్యతలు అప్పగించడం వల్ల శాఖలో అస్థిరత నెలకొంది.TODAY BAPATLA NEWS
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే — విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బి.సి. సంక్షేమ వసతిగృహాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. పర్యవేక్షణ లోపంతో ప్రవేశాల సంఖ్య తగ్గిపోగా, కొన్ని వసతిగృహాలు మూతబడుతున్నాయి. పేద విద్యార్థులకు చదువులో సహకారం అందించే వసతిగృహాలు క్రమంగా నిర్వీర్యమవుతున్నాయి.Chrala news:గుండెపోటుతో చీరాల అసిస్టెంట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ ఆకస్మిక మృతి :Assistant BC Welfare Officer of Chirala dies suddenly due to heart attack :citynewstelugu.com
ఇక, ఇటీవల జరిగిన మరో ఘటనలో — బాపట్ల జిల్లా Outsourcing Employees Duty Certificates ను సెప్టెంబర్ 26న గుంటూరు DBCW&EO కార్యాలయానికి ఆలస్యంగా పంపించడం వల్ల, ఆ జిల్లాలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దసరా పండుగకు ముందు జీతాలు పొందలేక, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ పూట తినడానికి తిండి లేక పస్తులు పెట్టిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.పీజీఆర్ఎస్ బాపట్ల సమావేశం — 164 ప్రజా అర్జీలు నమోదు
ఈ నిర్లక్ష్యంపై సంబంధిత వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, బాపట్ల జిల్లా DBCW&EO గారికి Show-Cause Notice జారీ చేసి, CCA నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా DBCW&EO కోరుతున్నారు.
ప్రజల పన్నుల డబ్బుతో నడిచే బి.సి. సంక్షేమ శాఖ నిజంగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నదా?
వసతిగృహాల మూతపడటానికి, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినటానికి, ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులకు బాధ్యత ఎవరు వహించాలి?
అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.