ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచే విధంగా ఎలక్షన్ కమిషన్ పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఏఐసీసీ కార్యదర్శి పాలక్ వర్మ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జే.డీ శీలం, డీసీసీ అధ్యక్షుడు చిలకా విజయకుమార్ ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓట్లు దొంగిలించేవిధానాలు ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పారు. GUNTUR NEWS: ముఖ్యమంత్రి సహాయ నిధి..
బీజేపీ సర్కార్ వెంటనే అధికారం నుంచి దిగి పోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వినూత్న ఉద్యమాలతో ప్రజలు వద్దకు వెళ్లడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న విధానాలపై లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్. ఈశ్వరరావు, ప్రకాష్, బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు