Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

6న జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల బహుకరణ

6న జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల బహుకరణ

గుంటూరు, అక్టోబరు 4 : స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల జిల్లా స్థాయి బహుకరణ కార్యక్రమం 6వ తేదీన జరుగుతుందని
జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవార్డుల బహుకరణ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుందని చెప్పారు.

జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి అవార్డులు, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వివరాలను స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర (SASA) పోర్టల్ (https://sasa.ap.gov.in/) లో పొందుపరచడం జరిగిందని చెప్పారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రోత్సాహక అవార్డులు – 2025కు, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమాల కింద స్వచ్ఛతా కార్యకలాపాలపై చేసిన ప్రశంశనీయ కృషిని గుర్తించడానికి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు.

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (తగ్గించటం, మళ్లీ ఉపయోగించడం, రీసైకిల్), సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో అవార్డు గ్రహీతలు పని చేయడం జరిగిందన్నారు. అవార్డులను మొత్తం 17 కేటగిరీలలో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను గుర్తించడానికి, అన్ని రంగాలలో ఉన్న వారి భాగస్వామ్యం పెంచుటకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అక్టోబర్ 6న విజయవాడలో రాష్ట్ర స్థాయి అవార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.

అవార్డులు – అవార్డుల విభాగాలు:రాష్ట్రస్థాయి అవార్డులు :

  • స్వచ్ఛ మున్సిపాలిటీలలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు ప్రత్యేక కేటగిరి)
  • మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఒక లక్ష నుండి మూడు లక్షల జనాభా కేటగిరి)
  • స్వచ్ఛ గ్రామ సంఘం కేటగిరీలో పొన్నూరు మండలం ములుకుదురు గ్రామం
  • స్వచ్ఛ అంగన్వాడి కేంద్రాలలో జొన్నలగడ్డ మెయిన్ అంగన్వాడి
  • స్వచ్ఛ రైతు బజార్ కేటగిరీలో చుట్టుగుంట రైతు బజార్

జిల్లాస్థాయి బహుమతులు- https://sasa.ap.gov.in/

  • స్వచ్ఛ మున్సిపాలిటీ విభాగంలో పొన్నూరు మున్సిపాలిటీ

ఉత్తమ స్వచ్ఛత వారియర్స్ (పారిశుద్ధ్య కార్మికులు)

ఉత్తమ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్

*చేబ్రోలు గ్రామపంచాయతీకి చెందిన నల్లపాటి రాఘవమ్మ
*నందివెలుగు గ్రామపంచాయతీ చెందిన కాబోటు సాల్మన్ రాజు
*వెంగళాయ పాలెం గ్రామపంచాయతీకి చెందిన చింతపల్లి జ్యోతి
*తుమ్మలపాలెం గ్రామపంచాయతీకి చెందిన ఉయ్యాల శివపార్వతి
*దుగ్గిరాల గ్రామపంచాయతీకి చెందిన పోకూరి రూప

స్వచ్ఛత అంగన్వాడీలు

*మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆంజనేయ కాలనీ అంగన్వాడి కేంద్రం
*గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వెంకట్రావుపేట అంగన్వాకేంద్రం *మేడికొండూరుకు చెందిన మేడికొండూరు అంగన్వాడి కేంద్రం *తెనాలికి చెందిన కొలకలూరు అంగన్వాడి కేంద్రం

ఉత్తమ స్వచ్ఛత ప్రభుత్వ కార్యాలయాలు

*పశ్చిమ గుంటూరులో ఏపీ సీపీడీసీఎల్ కార్యాలయం
*జిల్లా పరిషత్ గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయం

ఉత్తమ స్వచ్ఛత పరిశ్రమలు (భారీ/ మధ్య తరహా)

*గుంటూరుకు చెందిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్

ఉత్తమ స్వచ్ఛత పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఇ)

  • గుంటూరుకు చెందిన ఎస్ ఎల్ జి కుమార్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్
    *భారతి కన్జ్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఉత్తమ స్వచ్ఛ ఆసుపత్రులు

*మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల లాల్ బహుదూర్ నగర్ లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్

స్వచ్ఛ పాఠశాలలు

  • గుంటూరు పట్టణం ఆర్ నగర్ లో ఉన్న పీఎం సిహెచ్ స్కూల్
  • ఏటి అగ్రహారం ల ఉన్న ఎస్.కె బిఎంఎం సిహెచ్ స్కూల్
    *మంగళగిరి మండలం నూతక్కి లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్
    *ఎం పి ఎల్ హెచ్ స్కూల్, డబ్ల్యూ సి *తెనాలి మండలం నందివెలుగు జిల్లా పరిషత్ హై స్కూల్

ఉత్తమ స్వచ్ఛ గ్రామ పంచాయతీలు

  • చేబ్రోలు
  • దుగ్గిరాల
    *తుమ్మపాలెం (ప్రత్తిపాడు)
    *నందివెలుగు (తెనాలి)  
    *పేరేచర్ల (మేడికొండూరు)

ఉత్తమ స్వచ్ఛ స్లామ్ లెవెల్ ఫెడరేషన్

*సందిగుంట మహిళా స్లమ్ సమాఖ్య (గుంటూరు)

  • అంబేద్కర్ కాలనీ మహిళ స్లమ్ సమాఖ్య (పొన్నూరు)
  • సిద్ధి వినాయక నగర్ మహిళా స్లమ్ సమాఖ్య (పొన్నూరు)

ఉత్తమ స్వచ్ఛ గ్రామ సంఘాలు

*చిన్న పాలెం (దుగ్గిరాల)
*వల్లభాపురం (కొల్లిపార)
*పొన్నెకల్లు (తాడికొండ)
*లేమల్లెపాడు (వట్టిచెరుకూరు)

ఉత్తమ స్వచ్ఛ బస్ స్టేషన్

*గుంటూరు బస్ స్టేషన్

ఉత్తమ స్వచ్ఛ ఎన్జీవో

  • కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఎన్జీవోస్ కాలనీ, గుంటూరు
  • జిల్లా అర్బన్ సమాఖ్య, మెప్మా, గుంటూరు నగర పాలక సంస్థ

ఉత్తమ స్వచ్ఛ హాస్టల్

  • సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహం, ఎల్.ఎం.హెచ్ కాంపౌండ్, గుంటూరు
  • ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహం, గుంటూరు
  • పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహం, మైనారిటీ సంక్షేమం, ఆనందపేట, గుంటూరు
  • ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం, గుంటూరు

ఉత్తమ స్వచ్ఛ గురుకుల పాఠశాల

*డా.బి.ఆర్. అంబేద్కర్ బాలుర గురుకులం, అడవి తక్కెళ్ళపాడు, గుంటూరు గ్రామీణ

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, అవార్డు గ్రహీతలు, ప్రజలు పాల్గొంటారని చెప్పారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button