విజయవాడ, అక్టోబర్ 5:
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం (Dr. NTRUHS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి MBBS కోర్సులో చేరిన విద్యార్థులకు శుభవార్త ప్రకటించింది.
రాష్ట్ర కోటా కింద ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరి, తరువాత అదే కళాశాలలో ఆల్ ఇండియా కోటా (AIQ) కింద సీటు పొందిన విద్యార్థులు ఇకపై విశ్వవిద్యాలయ ఫీజు చెల్లించనవసరం లేదని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.NEET PG 2025-26 Admissions: Dr. NTR University Competent Authority Quota Notification Released
వీరు చెల్లించవలసిన రూ.10,600/- (పది వేల ఆరు వందలు) ఫీజును మినహాయిస్తూ నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ (HM&FW Dept.) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తీసుకున్నట్లు తెలిపింది.neet-pg-counselling-2023_1680938018484_1680938018689_1680938018689
ఫీజు మినహాయింపు పొందాలనుకునే విద్యార్థులు తమ తమ కళాశాల ప్రిన్సిపాల్‌లకు రాష్ట్ర కోటా మరియు ఆల్ ఇండియా కోటా అడ్మిషన్ ఆర్డర్ల కాపీలతో పాటు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. వి. రాధికా రెడ్డి తెలిపారు.
ఈ సౌకర్యం కేవలం డా. ఎన్.టి.ఆర్. యూనివర్సిటీకి అనుబంధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.