బాపట్ల, అక్టోబర్ 5:స్వచ్ఛతా కార్యక్రమాల్లో ఉత్తమంగా పనిచేసిన వారిని సత్కరించేందుకు బాపట్లలోని కమ్మ కళ్యాణ మండపం, జి.బి.సి. రోడ్డులో సోమవారం (అక్టోబర్ 6) న స్వచ్ఛతా అవార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేయనున్నారు.బాపట్ల జిల్లా: సుపరిపాలనలో తొలి అడుగు – ప్రజలకు సంక్షేమం||Bapatla District: Good Governance Doorstep Program in Bapatla
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో బాపట్ల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు, జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో మొత్తం 49 అవార్డులు లభించాయని వివరించారు. BAPATLA DISTRICT : An accident occurred opposite Sentence College on the Vetapalem bypass road in Bapatla
ఈ అవార్డుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2న ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి అవార్డు పంపిణీ కార్యక్రమం అక్టోబర్ 6న సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు.
కార్యక్రమానికి సంబంధించి అవార్డులు పొందిన అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై, జిల్లా ఇంచార్జి మంత్రి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించాలని Collector సూచించారు. jobs in local
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, బాపట్ల ఎంపీ, ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయి అవార్డులు ముఖ్యమంత్రి బాపట్ల ఎంపీ, ఎమ్మెల్సీలుచేతుల మీదుగా ఇప్పటికే అందజేయబడినట్లు కలెక్టర్ తెలిపారు.