chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:సెలూన్, స్పా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి : జాయింట్ కలెక్టర్అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు, అక్టోబరు 5:సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమం కింద సోమవారం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన జిఎస్టి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

సెలూన్లు, స్పా కేంద్రాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల ఫోటోలు, వీడియోలను సంబంధిత పోర్టల్‌లో వెంటనే అప్‌లోడ్ చేయాలని సూచించారు.

విద్యాసంస్థల్లో పోటీలు – 7, 8 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు:
ఈ నెల 7, 8 తేదీలలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థల్లో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థులలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ పోటీలకు గాను “జీఎస్టీ పరిణామం”, “ఒకే దేశం – ఒకే పన్ను”, “జీఎస్టీ 2.0 సంస్కరణలు”, “పన్ను ఉపశమనం”, “MSME అభివృద్ధిలో జీఎస్టీ పాత్ర” వంటి ఇతివృత్తాలను ఎంపిక చేయాలని సూచించారు.

జీఎస్టీ వల్ల వచ్చిన మార్పులు, సామాన్యుడిపై ప్రభావం, మౌలిక వసతుల అభివృద్ధిలో పాత్ర, డిజిటల్ పన్ను వ్యవస్థ ప్రాముఖ్యత, స్టార్టప్‌లకు లభించే ప్రయోజనాలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్‌లో జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. గీతమాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker