ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు శాఖకు తాజాగా జిఎంఏ హాల్లో నిర్వహించిన 2025-2026 కార్యవర్గం ఎన్నికలలో అధ్యక్షులుగా డాక్టర్ టి .సేవ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎం .శివప్రసాద్ ,కార్యదర్శిగా డాక్టర్ బి .సాయి కృష్ణ,సంయుక్త కార్యదర్శిగా…. కార్యవర్గ సభ్యులుగా మరో ….మంది ఎన్నికయ్యారు .అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ టి .సేవకుమార్ 2004లో ఐఎంఏ గుంటూరు శాఖలో సభ్యత్వం పొంది , శాఖలో అంచలంచలుగా క్రింది అన్ని పదవులు నిర్వహించి ఇప్పుడు అధ్యక్ష పదవి అందుకున్నారు. ఐఎంఏ కార్యక్రమాలలో క్రియాశీలకంగా ఉన్న డాక్టర్ టి. సేవకుమార్ ,గతంలోరాష్ట్ర వర్కింగ్ కమిటీలో, ఐఎంఏ వివిధ స్కీములలో పనిచేశారు.GUNTUR NEWS:రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన
ప్రస్తుతం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు .గుంటూరు వైద్య కళాశాల నుండి ఎంబిబిఎస్ పట్టా పొందిన డాక్టర్ టి. సేవ కుమార్,1996లో బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఎస్ హెచ్ ఓ) ను స్థాపించి నాటి నుండి నేటి వరకు ఉచిత వైద్య సలహాలు, అతి తక్కువ ఖర్చుకి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు అందిస్తున్నారు. రాష్ట్రంలో జనరిక్ మందులపై ప్రజలలో శాస్త్రియ అవగాహన కల్పించడంలోనూ, జనరిక్ ఫార్మసీల ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించారు. ప్రజల నిత్యావసర వస్తువులు, అన్ని రకాల ఆహార పదార్థాలు, అన్ని రకాల మందులపై జిఎస్టి జీరో లేదా నామమాత్రం గా ఉండాలని పోరాటాలు చేశారు, చేస్తున్నారు. అంతేగాక వైద్య, ఆరోగ్య అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు 12 సంవత్సరాల పాటు “హెల్త్ హెల్ప్ “మాసపత్రికను నిర్వహించారు.
ఆ పత్రికను పోస్టల్ శాఖ మార్కెటింగ్ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంలో సభ్యుడైన డాక్టర్ టి. సేవకుమార్,వివిధ పత్రికల్లో వైద్య, ఆరోగ్య ,విద్య, రాజకీయ అంశాలపై అనేక వ్యాసాలు రాశారు .2020 లో స్వయంగా ఎస్ హెచ్ ఓ ఏ పీ- టీవీ- యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ,వీడియోల ద్వారా వివిధ రంగాలలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. GUNTUR TODAY.: పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం..
అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలలో పాలకవర్గ సభ్యుడైన డాక్టర్ టి. సేవకుమార్ అధ్యక్షుడుగా ఆ పదవికి వన్నె తెస్తారని వైద్యులు ఆశిస్తున్నారు. అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ సేవకుమార్ ను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్, పూర్వ అధ్యక్షులు, డాక్టర్ ఎన్. కిషోర్, ఐ .ఎం .ఎ. సి.జి. పి రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎం .ఫర్నికుమార్, ఎన్నికల నిర్వహణ అధికారి, డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, ప్రస్తుత ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షులు, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు ,డాక్టర్ డి. అమరలింగేశ్వర రావు తదితరులు అభినందించారు. తనను ఏకగ్రీ వంగా ఎన్నుకున్న వైద్యులందరికీ డాక్టర్ టీ. సేవ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శాఖ కార్యక్రమాల లో క్రియాశీలకంగా ఉంటూ, రాష్ట్ర కార్యవర్గంతో కలిసి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.