
రాష్ట్రంలో టమాటా ధరలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాప్తాడు మార్కెట్లో టమాటా ధరలు గరిష్ఠం 18 కాగా.. కనిష్ఠం 9గా ఉందన్నారు. 30. నుంచి 40 మెట్రిక్ టన్నులకు మించి కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్ కు రాదన్నారు. దసరా సెలవుల దృష్ట్యా మరో 10 టన్నుల టమాటా అదనంగా చేరిందని తెలిపారు. రోడ్లపై రెండో గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించారన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు వర్షాల వల్ల ఎగుమతి తగ్గిందని ఆయన వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాలతో టమాటా అమ్మకాలు మందగించాయని మంత్రి పేర్కొన్నారు.







