ఆంధ్రప్రదేశ్బాపట్ల

బాపట్ల న్యూస్.:అధికారులతో వీక్షణ సమావేశం:

అధికారులతో వీక్షణ సమావేశం

గ్రామాలలోని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటం మురళి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి మండల అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని 25 మండలాలలో కేటాయించిన పనులలో 80% కంటే తక్కువగా ఉన్న మండలాలలో జనవరి,ఫిబ్రవరి,మార్చి నెలలోపు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయుటకు రోజువారి లక్ష్యాలను నిర్దేశించడమైనదని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి వారి పని శాతాన్ని మెరుపుచుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులలో ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు ఎక్కువ పని దినాలు కల్పించాలన్నారు. ఇప్పటివరకు ఎస్సీ కుటుంబాలకు 70.49%, ఎస్టి కుటుంబాలకు 59.68%, ఇతర కుటుంబాలకు 59.27% పని దినాలు కల్పించామన్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీ కుటుంబాలలో ఎంతమందికి జాబ్ కార్డులు ఉన్నాయో చూసుకోవాలన్నారు. ఎంతమందికి పని కల్పించామో లెక్కించుకుంటూ మండల యొక్క ప్రగతిని పెంచే విధంగా చూడాలన్నారు. జిల్లాకు వందరోజులు పని దినాల క్రింద 25 వేల కుటుంబాలను లక్ష్యాలుగా ఇచ్చారన్నారు. ఇప్పటివరకు 2284 కుటుంబాలకు పని కల్పించామన్నారు. పని దినాలలో 61 నుండి 70, 70 నుండి 80, 80 నుండి 90 రోజులకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి చూసుకొని వారికి లక్ష్యాలు ఇచ్చి 100 రోజుల పని దినాలను పెంచాలన్నారు. మెటీరియల్ కు సంబంధించిన పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేసి నిధులను ఖర్చు చేయాలన్నారు. జిల్లాకు 681 గోకులాల నిర్మాణానికి లక్ష్యాలను ఇవ్వగా 336 గోకులాలను పూర్తి చేయగలిగామన్నారు. మిగిలిన లక్ష్యాలను పూర్తి చేయుటకు రోజువారి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఈ నెలాఖరు లోపు పూర్తి చేయుటకు మండల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు 3045 నీటి కుంటలు ఏర్పాటు చేయుటకు లక్ష్యాలు నిర్దేశించబడ్డాయన్నారు. ఇప్పటికీ 411 చోట్ల నీటి కుంటల ఏర్పాటుకు స్థలం నిర్దేశించడం జరిగిందన్నారు. బల్లెకురవ, సంతమాగులూరు, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, ఇంకొల్లు,చినగంజాం, చీరాల, వేటపాలెం ప్రాంతాలలో నీటి కుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నీళ్లు అందుబాటులో లేనప్పుడు ఈ కుంటల నుండి నీరు ఉపయోగించుకుని పంటలను పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. నీటి కుంటలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు తెలిపారు. ఎం ఎస్ ఎం ఈ సర్వే లో నిర్దేశిత లక్ష్యాలలో ఎక్కువ శాతం పూర్తి చేసిన మండల అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. లక్ష్యాలను అధిగమించుటకు అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. మిగిలిన మండల అధికారులు వారి లక్ష్యాలను పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎం ఎస్ ఎం ఈ సర్వేకు నిర్దేశించిన లక్ష్యాలలో ఉన్నటువంటి తేడాలను సరిచేసి ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించాలని జి.ఎం.డి.ఐ.సి అధికారిని ఆదేశించారు. జిల్లాలో 100% గృహాల జియో టాకింగ్ పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఆధార్ కార్డులు కలిగి ఉండాలని అన్నారు. ఆధార్ కార్డు లేని వారు వెంటనే కామన్ సర్వీస్ సెంటర్లలో వారి వివరాలను నమోదు చేసుకుని ఆధార్ కార్డులు పొందాలన్నారు. ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరూ వినియోగించుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలని, అందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయుటకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి సచివాలయంలోని సిబ్బంది ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయని వారిపై చర్యలు తీసుకోబడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.వి.విజయలక్ష్మి, పిడి డిఆర్డిఏ పద్మ, డి ఎల్ డి వో సి.హెచ్ విజయలక్ష్మి, జి.ఎం.డి.ఐ.సి . బి శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button